తెలంగాణ

telangana

ETV Bharat / state

EC Focus on Critical Constituencies in Telangana : ఆ నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్​ ఫోకస్​.. రాష్ట్రానికి త్వరలో పరిశీలకులు

EC Focus on Critical Constituencies in Telangana : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధిక వ్యయం అయ్యే నియోజకవర్గాలను కూడా ఈసీ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది. అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే తీవ్ర వాద ప్రభావిత 12 నియోజకవర్గాలతో పాటు ఇప్పటి వరకు 48 స్థానాలను సమస్యాత్మకంగా గుర్తించారు.

Critical Constituencies in Telangana
EC Focus on Critical Constituencies in Telangana

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 8:23 AM IST

EC Focus on Critical Constituencies in Telangana ఎన్నికల్లో అధిక వ్యయం అయ్యే నియోజకవర్గాలు.. ఇక నుంచి సమస్యాత్మక ప్రాంతాలే

EC Focus on Critical Constituencies in Telangana : శాసనసభ ఎన్నికల్లో అధికంగా వ్యయం అయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ఈసీ(Election Commission) ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఆ తరహా నియోజకవర్గాలను కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. తీవ్రవాద ప్రభావిత 12 నియోజకవర్గాలతో పాటు ఇప్పటి వరకు 48 స్థానాలను సమస్యాత్మకంగా గుర్తించారు. రాష్ట్రానికి త్వరలో పరిశీలకులు రానున్నారు.

ఎన్నికల్లో ప్రలోభాల పర్వాన్ని అరికట్టే విషయమై కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ప్రత్యేకంగా దృష్టి సారించింది. అధికార యంత్రాంగానికి ఈసీ ఇప్పటికే స్పష్టమైన అదేశాలు జారీ చేసింది. షెడ్యూలు(Telangana Assembly Election 2023) వెలువడినప్పటినుంచీ రాష్ట్రంలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలునిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో, ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో భారీగా డబ్బు, బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

EC Identified 48 Critical Constituencies in Telangana : గత అనుభవాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా ఎక్కువ వ్యయం అయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాలను గుర్తిస్తున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించి ఆ తరహా నియోజకవర్గాలను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 35 వరకు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాలను గుర్తించినట్లు సమాచారం.

పొరుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న సిర్పూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలను తీవ్రవాద ప్రభావం ఉన్న వాటిగా సమస్యాత్మకంగా గుర్తించారు. అక్కడ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇతర కారణాలు ఉన్న మరో 35 నియోజకవర్గాలను కూడా ఇప్పటి వరకు సమస్యాత్మక జాబితాలో చేర్చారు. అక్రమాలు, డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, ఉచితాల స్వాధీనం ఆధారంగా ఈ సంఖ్య మారనుంది.

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల పూర్తి వివరాలు ఇవే..

Election Commission Focus onConstituencies in Telangana : ఈ తరహా నియోజకవర్గాలపై మరింత ప్రత్యేకంగా దృష్టి కేంద్రకరించనున్నారు. అదనంగా స్క్వాడ్స్, నిఘా బృందాలు, పరిశీలకులను నియమించనున్నారు. రాష్ట్రానికి త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు రానున్నారు. సాధారణ పరిశీలకులతో పాటు వ్యయ, పోలీసు పరిశీలకులు రానున్నారు. అవసరమైతే ప్రత్యేక పరిశీలకులను కూడా ఈసీ నియమిస్తుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు రాష్ట్రానికి పరిశీలకులుగా వస్తారు. రాష్ట్రం నుంచి కూడా కొంత మంది అధికారులు ఇతర రాష్ట్రాలకు పరిశీలకులుగా వెళ్తున్నారు.

Violation Of Election Code In Miryalaguda : మిర్యాలగూడలో ఎన్నికల కోడ్​కు ముసుగేసిన మున్సిపాలిటీ అధికారులు..

How to Carry Money when Election Code : రూ.50వేలు కంటే ఎక్కువ తీసుకెళ్తే.. తప్పనిసరిగా ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే...

ABOUT THE AUTHOR

...view details