EC CEO Vikas Raj Interview :సంతోషంగా ఉండాలని.. గ్రామాల్లో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగనే ఎంత ఆడంబరంగా నిర్వహిస్తాం.. అలాంటిది మన జీవితాలను మార్చే ఎన్నికలు.. అది కూడా 5 సంవత్సరాలకు వస్తాయి. వాటిని ప్రశాంతంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్(Vikas Raj) తెలిపారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు వేయవచ్చని.. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు పొందుపరిచామని.. అవసరమైతే రవాణా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరింత సమాచారం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
1.పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయా..? సిబ్బంది అంతా సిద్ధమయ్యారా?
జవాబు: మేం సిద్దమయ్యాము. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే చేరుకున్నారు. వారికి సామాగ్రి పంపించాం. ఈవీఎంలు పని చేస్తున్నాయో లేదో పరిశీలిస్తున్నారు. ఈవీఎంల(EVM)ను తీసుకుని సెక్టార్ ఆఫీసర్‌తో వారికి కేటాయించిన వాహనాల్లో వెళ్లేలా ఏర్పాటు చేశాం. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లకూడదని.. పోలింగ్ అధికారులకు ముందుగానే సూచనలు ఇచ్చాం. పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సాయంత్రం 6 గంటలకు సిబ్బంది మొత్తం చేరుకుంటారని అనుకుంటున్నాను.
2. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కోసం ఎటువంటి వసతులు కల్పించారు?
జవాబు : ఈ ఎన్నికలు జరిగినంత వరకు పండగ వాతావరణాన్ని నెలకొల్పాలని.. మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. అందువల్ల ఈ ఎన్నికల్లో అన్ని రకాల సౌకర్యాలు ఓటర్లు చూస్తారు. వీటితో పాటు దివ్యాంగుల కోసం, వృద్ధుల కోసం.. ఇంటి దగ్గర నుంచి పోలింగ్ కేంద్రం వరకు వారు కోరితే రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తాం. అలానే పోలింగ్ కేంద్రాల్లో(Polling Centers) వీల్‌ఛైర్స్ ఏర్పాటు చేశాం. వారికి సాయం చేసేందుకు అక్కడ వాలంటీర్లను కూడా పెట్టాం.
అంధుల కోసం బ్రెయిల్ లిపి(Braille Lipi Ballots)లో పోస్టల్ బ్యాలెట్, పోస్టర్స్ అందుబాటులో ఉంచాం. దీనివల్ల వారికి నచ్చిన నాయకున్ని ఎన్నుకోవచ్చు. వినికిడి లోపం ఉన్న వారికి కూడా పోస్టర్లు తయారుచేశాం. వారితో మాట్లాడే విధంగా పోలింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చాం.
ఓటరు మహాశయా మేలుకో - ఇకనైనా బద్ధకాన్ని వీడి పోలింగ్ కేంద్రానికి పోటెత్తు
3. రాష్ట్రంలో మొత్తం 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గురువారం ఎట్లా పర్యవేక్షణ చేయనున్నారు?
జవాబు : ప్రతి పోలింగ్ కేంద్రంలో సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. సమస్యాత్మక కేంద్రాల్లోనే కాకుండా, సామాన్య కేంద్రాల్లో కూడా వెబ్‌కాస్టింగ్ ఉంటుంది. మైక్రో పరిశీలకులు కూడా ఉంటారు. సీఆర్‌ఫీఎస్ బలగాలు ఉంటాయి. శాంతిభద్రతలకు ఏమైనా భంగం కలిగినట్టు అనిపిస్తే వారు వెంటనే స్పందించి.. పరిస్థితిని అదుపులోకి తీసుకుంటారు.
4.రాష్ట్రంలో సెలవు ప్రకటించినప్పటికీ.. కొన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వలేదనే వార్తలు వస్తున్నాయి?
జవాబు : రాష్ట్ర ప్రజలకు సెలవు కూడా ప్రకటించాం. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయవచ్చు. కొన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించలేదని సమాచారం మాకు అందింది. వారికి మేము చెప్పాం. డీఈఓలకు సమాచారం అందించాం. అన్ని సంస్థలు సెలవు ప్రకటించేలా చూసుకోవాలని సూచనలు ఇచ్చాం.
5.రాష్ట్రంలో సమస్యాత్మక కేంద్రాలు ఎన్ని ఉన్నాయి. అక్కడ పోలింగ్ సజావుగా జరిగేందుకు ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు?