తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈసీ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్​ చేయాలి' - hyderabad latest news today

రాష్ట్రంలో పనిచేస్తున్న ఈసీ ఏఎన్ఎంల సర్వీస్​ను క్రమబద్దీకరించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య ఐకాస ఛైర్మన్ డాక్టర్ బి.రమేశ్ డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న సుమారు రెండువేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

ec anms Regularized demand in telangana
'ఈసీ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్​ చేయాలి'

By

Published : Mar 5, 2020, 6:54 PM IST

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఈసీ ఏఎన్ఎంల సర్వీస్​ను క్రమబద్దీకరించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య ఐకాస ఛైర్మన్ డాక్టర్ బి.రమేశ్​ ఆవేదన వ్యక్తం చేశారు. 2003-04లో డీఎస్​సీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిన నియమితులైన ఈసీ ఏఏన్ఎంలు చాలీ చాలని జీతాలతో పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ పొందుతున్నారని నిరసన వ్యక్తం చేశారు.

జీఓ 119 మేరకు 45 వెయిటేజ్ మార్కులు ఇచ్చి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేక నియామక బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ ఒక్క నియామకం చేపట్టలేదన్నారు. బోర్డు ద్వారా శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు రెండువేల పోస్టులను వెంటనే భర్తీ చేయలని డిమాండ్ చేశారు.

'ఈసీ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్​ చేయాలి'

ఇదీ చూడండి :నాపై దాడి చేశారు... చర్యలు తీసుకోండి : రాహుల్ సిప్లిగంజ్

ABOUT THE AUTHOR

...view details