అమెరికాలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు తగిన సహకారాన్ని అందిస్తామని ఈబీ5 యూఎస్ఏ సర్వీసెస్ సంస్థ ప్రకటించింది. అన్ని రకాల అనుమతులను సులభంగా అందించేలా చూస్తామని తెలిపింది. 2017 నుంచి అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న తెలుగువారికి వివిధ రకాల వీసాల ప్రాసెసింగ్‌ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ హర్జీత్ సింగ్ తెలిపారు. సుమారు 50 లక్షల పెట్టుబడితో అమెరికాలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి అక్కడి ఇన్ వెస్టర్లు, అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివరించారు. ఇందులో పాల్గొన్న పలువురు అమెరికాలో అంకుర వ్యవస్థాపనపై అవగాహన పెంపొందించుకున్నారు.
'అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి సాయమందిస్తాం' - VISS PROBLEMS
అమెరికా వెళ్లాలనుకుంటున్నారా... అక్కడే వ్యాపారం ప్రారంభించి గ్రీన్‌కార్డు సంపాదించాలనుకుంటున్నారా.. అయితే మమ్మల్ని సంప్రదించండి సాయం చేస్తామంటూ ముందుకొస్తోంది ఈబీ5 యూఎస్ఏ సర్వీసెస్ సంస్థ.
'అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి సాయమందిస్తాం'