EATALA: ఈ నెల 14న భాజపాలో చేరనున్న ఈటల రాజేందర్ - telangana varthalu
18:18 June 10
ఈ నెల 14న భాజపాలో చేరనున్న ఈటల రాజేందర్
మాజీమంత్రి ఈటల రాజేందర్ భాజపాలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న అనుచరులతో కలిసి ఈటల కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో.... ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ భాజపాలో చేరనున్నారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను అందించేందుకు స్పీకర్‌ను ఈటల రాజేందర్ సమయం కోరగా.... సభాపతి ఇవ్వకపోవడంతో ఈ మెయిల్ ద్వారా పంపిస్తారని తెలుస్తోంది.
ఇదీ చదవండి: Guidelines: ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు