తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కాలం: రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం - healthy fruits to eat in carona time

శరీరంలో ప్రొటీన్‌ తక్కువగా ఉంటే రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఫలితంగా ఆకలి ఎక్కువగా వేస్తుంది. జుట్టు ఊడిపోతుంది. గోళ్లు విరిగిపోతాయి. చర్మ సమస్యలూ వస్తాయి. మరి వీటిని అధిగమించాలంటే ప్రొటీన్లు ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవాలి. మనకు లభించే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా లభించే పండ్లు ఏమిటో తెలుసా..?

eat these in order to boost immunity
కరోనా కాలం: రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం

By

Published : Jul 2, 2020, 10:37 AM IST

రోజురోజుకు రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఏ రోగమైనా మొట్టమొదట రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పైనే దాడి చేసి, గెలిచి మన శరీరాన్ని ఆక్రమిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. దాన్ని ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి.

జామకాయ: దీంట్లో విటమిన్‌-సి అధికమొత్తంలో ఉంటుంది. దాంతోపాటు మాంసకృత్తులూ ఎక్కువే ఉంటాయి. 100 గ్రాముల జామ నుంచి దాదాపు 2.6 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల మనలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి. పీచు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారూ వీటిని తినొచ్చు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి రోగకారక క్రిములను అంతం చేస్తాయి.

ఎండుద్రాక్ష: ఇవి రుచిగా ఉండటంతో పాటు బోలెడు పోషకాలనీ అందిస్తాయి. వీటిలో ఐరన్‌, పొటాషియం, పీచు, విటమిన్లు, మాంసకృత్తులు తగిన పాళ్లలో ఉంటాయి. 100 గ్రాముల కిస్‌మిస్‌ నుంచి దాదాపు 3.39 గ్రాముల మాంసకృత్తులు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వీటిలో ఐరన్‌ ఉండటం వల్ల రక్తహీనత సమస్య ఎదురుకాదు, దాంతో ముఖం కాంతిమంతంగా మారుతుంది.

పనసపండు: అద్భుతమైన రుచిని పంచే ఈ పండు మనలో మాంసకృత్తుల లేమి కలగకుండా చూస్తుంది. 100 గ్రాముల పండు నుంచి 1.8 గ్రాముల ప్రొటీన్‌ అందుతుంది. రోగనిరోధక కారకాలైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఐరన్‌లను కలిగి ఉంటుంది.

ఇవీ చూడండి:రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... బుధవారం 1,018 కొత్త కేసులు

ABOUT THE AUTHOR

...view details