ఈస్టర్ పర్వదినం పురస్కరించుకొని హైదరాబాద్ నారాయణ గూడలోని బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవులు ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి సంప్రదాయం ప్రకారం శిలువను ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రార్థన మందిరంలో ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనంతరం చర్చి ఫాస్టర్ డాక్టర్ శామ్యూల్ భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్ వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. ఆలయ ప్రాంగణాలన్నీ ప్రభు గీతాలతో మార్మోగాయి. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
నారాయణ గూడ బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు - narayanaguda baptist church
హైదరాబాద్ నారాయణ గూడలోని బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చర్చి ఫాస్టర్ డాక్టర్ శామ్యూల్ భక్తులకు దైవ సందేశాన్ని అందించారు.
ఈస్టర్ ప్రార్థనలు