కార్మిక, దళిత, స్త్రీ శ్రేయస్సు కోసం విశేష కృషి చేసిన ఈశ్వరీబాయి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవరసం ఉందని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమొరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వర్ధంతి సభను నిర్వహించారు. ఆమె ఒక సాహస వనిత, ఆదర్శనాయకురాలు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారురమణాచారి, పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఈశ్వరీ బాయి కూతురు మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్యురాలుగా పేద ప్రజలకు సేవ చేయలన్నదే అమ్మ ఆశయమని... అయితే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారని గీతారెడ్డి అన్నారు.