తెలంగాణ

telangana

ETV Bharat / state

మహానగరంలో మళ్లీ భూప్రకంపనలు..! - హైదరాాబద్​లో భూప్రకంపనలు

హైదరాబాద్‌ మహానగరంలో మరోసారి భారీ శబ్దాలతో కూడిన భూప్రకంపనలు స్థానికులను బెంబేలెత్తించాయి. గచ్చిబౌలి టీఎన్‌జీఓస్‌ కాలనీతోపాటు ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మంగళవారం రాత్రి భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

earthquake in hyderabad
మహానగరంలో మళ్లీ భూప్రకంపనలు..!

By

Published : Oct 15, 2020, 7:35 AM IST

భాగ్యనగరంలో మళ్లీ భూమి కంపించింది. గచ్చిబౌలి టీఎన్‌జీఓస్‌ కాలనీతోపాటు ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మంగళవారం రాత్రి భూప్రకంపనలు వచ్చాయి. మంగళవారం రాత్రి 1.30 గంటలకు మొదలై బుధవారం తెల్లవారుజామున 4గంటల వరకు పలుమార్లు భూమి కంపించి, ఇళ్లు అదిరాయని స్థానికులు తెలిపారు. తిరిగి బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి గంటకోసారి భారీ శబ్దాలతో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు వారు చెప్పారు.

బుధవారం రాత్రి పెద్దస్థాయిలో శబ్దాలు రావడంతో కాలనీవాసులంతా రోడ్ల మీదికొచ్చారు. అక్కడివారి ఫిర్యాదుతో శేరిలింగంపల్లి ఉపకమిషనర్‌ వెంకన్న ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాలనీవాసులతో మాట్లాడి డీఆర్‌ఎఫ్‌ బృందాల్ని అందుబాటులో ఉంచుతున్నామని.. నిపుణులతో మాట్లాడి కారణం తెలుసుకుంటామని భరోసానిచ్చారు.

ఇదీ చదవండి:అప్పుడు ఆనందం నింపిన వాడే.. చివరికి కన్నీళ్లు మిగిల్చాడు

ABOUT THE AUTHOR

...view details