ఆంధ్రప్రదేశ్లో రెండు జిల్లాల్లో భూకంపం జనాలను హడలెత్తించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూమి కంపించింది. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, దుత్తలూరు, కొండాపురం మండలాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. వింజమూరు, వరికుంటపాడు మండలాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. ప్రకాశం జిల్లా పామూరు మండలంలో భూమి స్వల్పంగా కంపించింది. పామూరు పరిసర గ్రామాల్లో 3 సెకండ్లపాటు భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. దీంతో.. ఏం జరుగుతోందో అర్థంకాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఆ రెండు జిల్లాల్లో భూకంపం హడలెత్తిన ప్రజలు - earthquake in andhra pradesh
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇవాళ భూమి కంపించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి.
earthquake