తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు ఆకాశంలో అద్భుతం.. ఒకే కక్ష్యలోకి భూమి, సూర్యుడు, కుజుడు - మార్స్​ గ్రహం

Today three planets will come in the same orbit: నేడు ఆకాశంలో అద్భుతం జరగనుంది. భూమి, సూర్యుడు, కుజ గ్రహాలు ఒకే కక్ష్యలోకి రాబోతున్నాయి. ప్రతి 26 నెలలకోసారి ఇలా జరుగుతుంది. ఉదయం 11:12 గంటలకు ఈ ఖగోళ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది.

planets
గ్రహాలు

By

Published : Dec 8, 2022, 6:56 AM IST

Today three planets will come in the same orbit: నేడు భూమి, సూర్యుడు, కుజ గ్రహాలు ఒకే కక్ష్య(సరళరేఖ)లోకి రాబోతున్నట్లు ప్లానిటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్‌రావు తెలిపారు. ఉదయం 11:12 గంటలకు ఈ ఖగోళ విశేషం ఆవిష్కృతం అవుతుందన్నారు. ‘భూమికి దగ్గరగా రావడంతో కుజ గ్రహం పెద్దదిగా, కాంతిమంతంగా కనిపిస్తుంది. సూర్యుడు అస్తమించిన తరువాత కూడా తూర్పు వైపు చిరకాంతితో దర్శనమిస్తుంది. ప్రతి 26 నెలలకోసారి ఇది పునరావృతం అవుతుంది.

ఇప్పుడు కనిపించేంత కాంతిమంతంగా గ్రహాన్ని చూడాలంటే మరో తొమ్మిదేళ్లు ఆగాల్సి ఉంటుంది. ఈ ఖగోళ విశేషం వచ్చే ఏడాది జులై వరకు కనువిందు చేస్తుంది. రోజులు గడిచేకొద్దీ భూమికి, గ్రహానికి మధ్య దూరం పెరుగుతూ కుజ గ్రహ కాంతి తగ్గుతూ వస్తుంది. దాన్ని వీక్షించేందుకు హైదరాబాద్‌ బోయినపల్లిలోని సెయింట్‌ ఆండ్రివ్స్‌ పాఠశాలలో ఏర్పాట్లు చేస్తున్నాం’ అని రఘునందన్‌రావు వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details