Eamcet: ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు - telangana varthalu
18:07 June 17
ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు
ఎంసెట్ (Eamcet) ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఉన్నత విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును రెండుసార్లు పొడిగించారు. మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడగా... మార్చి 20 నుంచి మే 18వరకు దరఖాస్తులకు గడువిచ్చారు. కొవిడ్ నేపథ్యంలో దానిని మే 26 వరకు పొడిగించారు. అనంతరం మరోసారి జూన్ 17వరకు గడువును పొడిగిస్తూ ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇంకా పరిస్థితులు మెరుగుపడకపోవడంతో ఇవాళ గడువును మరోసారి పొడిగించారు.