నేటి నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని వారికి నవంబర్ 1న మరోసారి అవకాశం కల్పించారు. నవంబర్ 1న ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 31న ఆన్లైన్లో ప్రాసెసింగ్ రుసుం చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రవేశాల కమిటీ ఛైర్మన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
నేటి నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ - హైదరాబాద్ వార్తలు
ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ సవరించిన షెడ్యూల్ ప్రకటించారు. నేటి నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని వారికి... నవంబర్ 1న మరోసారి అవకాశం కల్పించారు.
ఇవాళ్టి నుంచి నవంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 4న ఇంజనీరింగ్ తుది విడత సీట్లను కేటాయించనున్నారు. నవంబర్ 4 నుంచి 7 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ... బుధవారం హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వాయిదా పడింది. ఓపెన్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు 35శాతం మార్కులనే ప్రవేశ పరీక్షలకు అర్హత పరిగణించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా సవరించిన షెడ్యూలు విడుదల చేశారు.
ఇదీ చదవండి:రీడిజైన్ చేయాలంటూ తప్పుడు నివేదిక ఇచ్చారు: వంశీచంద్ రెడ్డి