తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనెల 19 నుంచి ఎంసెట్​ ఫార్మసీ కౌన్సెలింగ్​ ప్రక్రియ - తెలంగాణ విద్యా వార్తలు

ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల ఫార్మాసీ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 19న ప్రారంభం కానుంది. రెండు విడతల్లో బీఫార్మసీ, ఫార్మ్ డీ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా ఉన్నత విద్యా మండలి షెడ్యూలు ఖరారు చేసింది.

ఈనెల 19 నుంచి ఎంసెట్​ ఫార్మసీ కౌన్సెలింగ్​ ప్రక్రియ
ఈనెల 19 నుంచి ఎంసెట్​ ఫార్మసీ కౌన్సెలింగ్​ ప్రక్రియ

By

Published : Nov 13, 2020, 9:01 PM IST

ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల ఫార్మాసీ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 19న ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం అభ్యర్థులు ఈనెల 19 నుంచి 21 వరకు ఆన్​లైన్​లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 20, 21 తేదీల్లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. 20 నుంచి 22 వరకు వెబ్​ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. 24న తొలి విడత బీఫార్మసీ, ఫార్మ్ డీ సీట్లను కేటాయిస్తారు. ఈనెల 24 నుంచి 27 వరకు ఆన్​లైన్​లో బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ పేర్కొన్నారు.

డిసెంబరు 1న చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తుది విడత ధ్రువపత్రాల పరిశీలన కోసం డిసెంబరు 1న ఆన్​లైన్​లో ప్రొసెసింగ్ రుసుము చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. డిసెంబరున 2న ధ్రువపత్రాల పరిశీలన, డిసెంబరు 2, 3 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ పూర్తి చేసి డిసెంబరు 5న తుది విడత సీట్లను కేటాయిస్తారు. తుది విడత కౌన్సెలింగ్ లో సీటు వచ్చిన అభ్యర్థులు డిసెంబరు 5 నుంచి 9 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని నవీన్ మిత్తల్ తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో మిగిలిన సీట్ల స్పాట్ అడ్మిషన్ల కోసం డిసెంబరు 5న మార్గదర్శకాలు విడుదలవుతాయి.

ఇదీ చూడండి:'దూద్ దురంతో 4 కోట్ల లీటర్లు దాటిన పాల రవాణా'

ABOUT THE AUTHOR

...view details