ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం నిర్వహించిన పరీక్షలో సుమారు 77 శాతం మేర హాజరు నమోదైనట్లు కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని గోవర్ధన్ స్పష్టం చేశారు. గురు, శుక్రవారాలతో సహా ఈనెల 14న రోజుకు రెండు సెషన్లలో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష కొనసాగనున్నట్లు ఆయన వివరించారు. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్నట్లు పేర్కొన్నారు.
తొలి రోజు ఎంసెట్ పరీక్షకు 77 శాతం హాజరు : కన్వీనర్ 'ఉష్ణోగ్రత తగ్గాకే పరీక్ష రాయండి'
ఇద్దరు విద్యార్థులకు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు కావడంతో... అధికారులు వెనక్కి పంపించారు. ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత పరీక్ష రాయాలని సూచించారు. తమకు కరోనా పాజిటివ్ ఉందని.. ఐదారుగురు విద్యార్థులు కన్వీనర్ కార్యాలయానికి ఫోన్లు చేయడం గమనార్హం.
తొలి రోజు ఎంసెట్ పరీక్షకు 77 శాతం హాజరు : కన్వీనర్ విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటాం..
కొవిడ్ పాజిటివ్ ఉన్న వారికి అన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒక్కో కేంద్రంలో దాదాపు 200 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.
తొలి రోజు ఎంసెట్ పరీక్షకు 77 శాతం హాజరు : కన్వీనర్ అందువల్ల వారికి కొంత ఇబ్బంది...
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఉండటంతో.. కేంద్రానికి చేరుకోవడానికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆటోలు, క్యాబ్‌ల్లో పరీక్ష కేంద్రాలకు తరలివెళ్లారు.
ఇవీ చూడండి : రెవెన్యూ సంస్కరణలతో ప్రజల ఇబ్బందులు తొలగుతాయి: కేసీఆర్