హైదరాబాద్ కూకట్పల్లి జెఎన్టీయూలో ఏర్పాటు ఎంసెట్ పరీక్ష కేంద్రంలో పరీక్ష ప్రారంభమైంది. విద్యార్థులు ఉదయం ఏడు గంటల నుంచే కేంద్రం వద్దకు చేరుకున్నారు. సెంటర్ వద్ద విద్యార్థులకు భద్రతా సిబ్బంది మూడు దశల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి లోనికి అనుమతించారు.
ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష - jntu hyderabad latest news
రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్న ఈ పరీక్షలు నేడు, 10,11,14 తేదీల్లో జరగనున్నాయి. హైదరాబాద్ కూకట్పల్లి జెఎన్టీయూలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు రెండు గంటల ముందే చేరుకున్నారు.
ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష
ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్న ఈ పరీక్షలు నేడు, 10,11,14 తేదీల్లో జరగనున్నాయి. రోజు రెండు ధఫాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష జరగనుంది.