తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంసెట్ మొదటి విడత బైపీసీ అభ్యర్థుల సీట్ల కేటాయింపు పూర్తి.. - తెలంగాణలో ఎంసెట్ సీట్ల కేటాయింపు

EAMCET BIPC Seats allotment complete: ఎంసెట్ మొదటి విడత బైపీసీ అభ్యర్థుల సీట్ల కేటాయింపు పూర్తయింది. మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 13 వరకు ఆన్ లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఈనెల 22 నుంచి 25 వరకు కాలేజీలకు వెళ్లి చేరాలన్నారు.

EAMCET BIPC Seats allotment complete
తెలంగాణ ఎంసెట్

By

Published : Nov 8, 2022, 7:09 PM IST

EAMCET BIPC Seats allotment complete: రాష్ట్రంలోని ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు మొదట విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. బీఫార్మసీలో 116 కాలేజీల్లో 7 వేల 586 సీట్లు ఉండగా... మొదటి విడతలో 7వేల 433 భర్తీ కాగా మరో 153 మిగిలాయి. ఫార్మా డీలో 60 కాలేజీల్లో 1312 సీట్లుండగా.. అన్నీ భర్తీ అయ్యాయి. బయో మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో 164సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయ్యాయి.

ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో సీట్లన్నీ మొదటి విడతలోనే భర్తీ అయ్యాయి. మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 13 వరకు ఆన్ లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఈనెల 22 నుంచి 25 వరకు కాలేజీలకు వెళ్లి చేరాలన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details