తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ

ఎంసెట్​ ఫలితాలను ఉన్న విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులో 92.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించింది.

eamcet agriculture results released today
ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ

By

Published : Oct 24, 2020, 4:18 PM IST

ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులో 92.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించింది. అగ్రికల్చర్‌ విభాగం పరీక్షకు 80.85 శాతం అభ్యర్థులు హాజరయ్యారని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. 63వేల 857 మంది అభ్యర్థులకుగాను 59 వేల 113 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. నవంబర్‌లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్​ను విడుదల చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. అభ్యర్థుల ర్యాంకు కార్డులు http://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయని వెల్లడించారు.

తొలి మూడు బాలికలకే..

ఎంసెట్‌లో తొలి మూడు ర్యాంకులను బాలికలు కైవసం చేసుకున్నారు. ఏపీకి చెందిన గుత్తి చైతన్య సింధు ఎంసెట్‌లో తొలి ర్యాంకును సాధించింది. మారెడ్డి సాయి త్రిషా రెడ్డి(సంగారెడ్డి)కి రెండోర్యాంకు, తుమ్మల స్నికిత మూడోర్యాంకు, దర్శి విష్ణు సాయి 4వ ర్యాంకు,మల్లిడి రిషిత్ 5వ ర్యాంకు సాధించారు. చిగురుపాటి శ్రీమల్లిక్ 6వ ర్యాంకు, ఆవుల‌ సుభాన్-7వ ర్యాంక్‌, గారపాటి గుణ చైతన్య 8వ ర్యాంక్‌, గిండేటి వినయ్ కుమార్ 9వ ర్యాంక్‌, కోట వెంకట్ 10వ ర్యాంకులు కైవసం చేసుకున్నారు.

తొలి ఐదు ర్యాంకులు
ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఇవీ చూడండి: ప్రభుత్వం ప్రకటన చేసింది.. జనం బారులు తీరారు..

ABOUT THE AUTHOR

...view details