హైదరాబాద్‌లో జరుగుతోన్న ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేస్ మొదటి విడత ముగిసింది. రేపు ఉదయం 8.10 గంటలకు రెండో ప్రాక్టీస్ రేసు జరగనుంది. అంతకుముందు ప్రాక్టిస్ రేస్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దీంతో రేస్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. సాయంత్రం 4.30 గంటలకు రేస్ జరగాల్సి ఉండగా.. ఇంతలోనే ఒక్కసారిగా సాధారణ వాహనాలు ట్రాక్‌పైకి దూసుకొచ్చాయి. ఊహించని ఘటనతో అప్రమత్తమైన నిర్వాహకులు రేస్‌ను 45 నిమిషాల పాటు నిలుపుదల చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగినట్లు గుర్తించారు. ట్రాక్ మొత్తం కలియతిరిగి తనిఖీ నిర్వహించారు. అనంతరం రేసింగ్‌ను ప్రారంభించారు. కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఫార్ములా ఈ-రేస్ మొదటి ప్రాక్టీస్ రేసు దాదాపు 30 నిమిషాలు జరిగింది. హుస్సేన్‌సాగర్ తీరంలో ప్రత్యేక ట్రాక్‌పై రేసింగ్ నిర్వహించారు.లుంబినీ పార్క్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు ఈ రేస్ జరిగింది. రేస్‌లో 11 ప్రముఖ కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు, 22 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ రేసింగ్‌ను చూడడానికి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మిణి, మహేశ్‌బాబు భార్య నమ్రత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు వచ్చారు.