లాక్డౌన్ సమయంలో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా పలు విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు సంస్థలు ఈ-లెర్నింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. మణిపాల్ గ్రూపుకు చెందిన కోఎంప్ట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మూడునెలల ఉచిత ఈ- లెర్నింగ్ సౌకర్యం కల్పించింది.
లాక్డౌన్ వేళ ఈ-లెర్నింగ్ ద్వారా పాఠాలు - corona news
లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూసివేయటం, బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో విద్యాసంస్థలు ఆన్లైన్ ఈ- లెర్నింగ్‌కు దారులు తెరిచారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా చదువుకునేందుకు యూనివర్సిటీలు, ప్రైవేట్ విద్యాసంస్థలు అవకాశం కల్పిస్తున్నారు.
లాక్డౌన్ వేళ ఈ-లెర్నింగ్ ద్వారా పాఠాలు
ఏప్రిల్ మొదలుకొని మూడు నెలల పాటు.. 165 సబ్జెక్టులు, 700 ప్రాక్టికల్ ఈ- ల్యాబ్ ప్రయోగాలు నేర్చుకునేందుకు అవకాశం కల్పించింది. కోఎంప్ట్ ఈ- లెర్నింగ్ కోర్సులో లెక్చర్ స్లైడ్లు, పీపీటీలు, పీడీఎఫ్ టాస్కులు, సబ్జెక్టు మెటీరియల్ వంటివి ఇంజినీరింగ్ విద్యార్థులు యాక్సెస్ చేసుకొని... చదువులో వెనుకబడకుండా ఉండొచ్చని పేర్కొంది.
ఇవీచూడండి:పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది