E Cigarettes Gang Arrest in Hyderabad : హైదరాబాద్‌లో ఈ- సిగరెట్లు విక్రయిస్తున్న వ్యక్తులకు బేకరీ షాపులు, కిల్లీ కొట్టులు అడ్డాగా మారాయి. కాలేజ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు(Software Employees) కస్టమర్లుగా మలుచుకుని వ్యాపారం సాగిస్తున్నారు. వాటిని అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు పట్టుకోవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పది రోజుల క్రితం సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ-సిగరెట్లు(E-Cigarettes) విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
రాయదుర్గం పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న మాధవ్.. కోల్‌కతాకు చెందిన దీపక్, యశ్.. ముంబయికి చెందిన తేజ్‌ల నుంచి కొరియర్ ద్వారా ఈ-సిగరెట్లు తెప్పించుకున్నాడు. పంజాగుట్ట, శంకర్ పల్లి, బాచుపల్లి, కొండాపూర్, షేక్‌పేట్‌లో ఉన్న పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు విక్రయించాడు. 63మంది కళాశాల విద్యార్థులకు మాధవ్ ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసుల దర్యాప్తులో తేలింది.
E-Cigarettes Gang Arrested in Jubilee Hills: పంజాగుట్టలోని ఓ కళాశాలకు చెందిన అచ్యుత్ గౌతమ్.. మాధవ్ నుంచి తక్కువ ధరకు ఈ-సిగరెట్లు కొనుగోలు చేసి వాటిని సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 71మంది సాప్ట్వేర్ ఉద్యోగులకు అచ్యుత్ గౌతమ్ ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆగష్టు 10వ తేదీన జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెం 36లో ఉన్న ఒలంపియా పాన్‌షాప్‌లో దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి నలుగురిని అదుపులోకి తీసుకుని.. వారి దగ్గర నుంచి రూ.2లక్షలు విలువ చేసే ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ముగ్గురు కళాశాల విద్యార్థులున్నారు.
ఈ సిగరెట్లు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: డీజీపీ
RS.5 Lakh Worth E-Cigarettes Collected by Police : ఆగస్టు 4వ తేదీన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రాయదుర్గంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో దాడి చేసి ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పలు బ్రాంచీలు ఉన్న ఈ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో నిషేధిత ఈ-సిగరెట్లు లభించినందున పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ-సిగరెట్లు కొనుగోలు చేయడానికి వచ్చిన ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు చెందిన 5గురు విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. గత నెల జీడిమెట్లకు చెందిన ఓ వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.15లక్షలు విలువ చేసే ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్(Instagram)లో ఆర్డర్ తీసుకొని జీడిమెట్ల నుంచి పంజాగుట్టకు తీసుకొచ్చి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
College Students Addiction E-Cigarettes in Telangana : ఈ-సిగరెట్లను ఎక్కువగా ముంబయి నుంచి హైదరాబాద్‌కు సరఫరా అవుతున్నాయి. కొరియర్ లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో భాగ్యనగరానికి తీసుకొస్తున్నారు. కిల్లీకొట్లు, హుక్కా పార్లర్లు, బేకరిల్లో వాటికి అడ్డాగా మారాయి. వాటిని కొత్త వాళ్లకు కాకుండా.. తరచూ తీసుకునే కస్టమర్లకు మాత్రమే అమ్ముతున్నారు. కళాశాల విద్యార్థులతో పాటు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వాటిని విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల పాఠశాలలకు చెందిన విద్యార్థులు వాటికి బానిసలు అయ్యారని పోలీసులు గుర్తించారు. నానక్‌రామ్ గూడలో ఓ బేకరి యజమానిని ఎస్ఓటీ పోలీసులు ఆగస్ట్‌లో అరెస్ట్ చేశారు. ఈ-సిగరెట్లు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా ఈ-సిగరెట్లు, సిగరెట్ల పట్టివేత
ఈ-సిగరెట్లు కాల్చితే రూ.లక్షల్లో జరిమానా, జైలు శిక్ష!
'ఈ-సిగరెట్లు': సమగ్ర నిషేధమే జాతిహితం..!