తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆడవాళ్లపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా.. ప్రభుత్వంలో చలనం లేదు' - minor girl rape in khammam

ఖమ్మంలో మైనర్​ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుణ్ని వెంటనే శిక్షించాలని సికింద్రాబాద్ చిలకలగూడ కూడలి వద్ద డీవైఎఫ్​ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహిళలపై ఎన్ని ఆకృత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లుగా చలనం లేకుండా ఉండటం శోచనీయమని అన్నారు.

dyfi protest in hyderabad a
హైదరాబాద్​లో డీవైఎఫ్​ఐ ధర్నా

By

Published : Oct 8, 2020, 3:42 PM IST

ఖమ్మంలో మైనర్​ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుణ్ని వెంటనే శిక్షించాలని డీవైఎఫ్​ఐ నాయకులు డిమాండ్ చేశారు. తన ఇంట్లో పని చేస్తున్న బాలికపై అత్యాచారయత్నం చేయడమే కాకుండా.. ఎవరికైనా చెబుతుందేమోనని అత్యంత దారుణంగా.. కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు యత్నించిన మారయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ చిలకలగూడలో ఆందోళనకు దిగారు.

ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలికకు ప్రభుత్వమే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్న ప్రభుత్వం చలనం లేకుండా ఉండటం బాధాకరమని వాపోయారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డీవైఎఫ్​ఐ నాయకులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details