Dussehra Special Home Foods :దసరా పండుగ రోజున నోరూరించే పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. తెలంగాణాలో గారెలు, అరిసెలు, మడుగులు, కారప్పూసలు, సకినాలు, లడ్డూలు, కారా, జిలేబీ, బూందీ, చెగోడీలు, కరిజలు వంటి నోరూరించే పిండి వంటలు చేసుకుంటారు. కానీ.. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు వాటిని చేసుకునేంత ఓపిక, తీరిక ఉండడం లేదు. దీంతో చాలా మంది పిండి వంటలు అనగానే 'హోమ్ ఫుడ్స్'కు పరుగులు తీస్తున్నారు. హోమ్ ఫుడ్స్‌లో అందరికీ ఇష్టమైన ఖాజాలు, సున్నుండలు, పూతరేకులు, రకరకాల మిఠాయిలు కూడా లభిస్తున్నాయి. వీటితో పాటు రోజూ తినేటువంటి పచ్చళ్లు, పొడులు కూడా లభిస్తున్నాయి.
Tallest Effigy of Ravana : దేశంలోనే అత్యంత ఎత్తైన రావణుడి బొమ్మ.. 171 అడుగుల ఎత్తుతో..
ఇంట్లో చేసేటువంటి రుచి, శుచి ఉండటంతో చాలా మంది హోంపుడ్స్లో కొనుగోలు చేస్తున్నారు. పూర్వకాలంలో పిండివంటలను చేసేందుకు చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు అందరూ కలిసి చేసుకునేవాళ్లు. కానీ.. ఇప్పుడా రోజులు లేవు. ఎవరి ఇంట్లో వారే చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో చేసే ఓపిక లేకపోవడం వల్ల హోమ్ పుడ్స్ ను ఆశ్రయిస్తున్నామని నగరవాసులు పేర్కొంటున్నారు. పండుగ రోజుల్లో ఎక్కువ కొనుగోళ్లు జరుగుతుంటాయని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం కొనుగోలు చేసేవారి అభిరుచికి అనుగుణంగా పిండి వంటలు చేయడమే అని పేర్కొంటున్నారు.
"అప్పటి కాలంలో పండుగ అంటే చాలా రకాల పిండి వంటకాలు చేసుకునే వాళ్లం. ఉమ్మడి కుటుంబాలు.. పండుగను సందడిగా జరిపేవాళ్లం. డబ్బులు ఎక్కువయ్యాయి. ప్రేమలు దూరమయ్యాయి. ఇప్పుడు ఓపిక లేక 'హోమ్ ఫుడ్స్' నుంచి తెచ్చుకుంటున్నాం."- చంద్రికా గౌడ్, కొనుగోలుదారు.