తెలంగాణ

telangana

ETV Bharat / state

Dussehra sharan navaratri 2021: ఇంద్రకీలాద్రిలో ఘనంగా వేడుకలు.. రాజేశ్వరిగా అమ్మవారి దర్శనం - Dussehra sharan navaratri 2021

ఏపీలోని బెజవాడ దుర్గ గుడి (VIJAYAWADA DURGA TEMPLE)లో దసరా శరన్నవరాత్రి వేడుకలు నేటితో ముగియనున్నాయి. అమ్మవారు ఈరోజు భక్తులకు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. పూర్ణాహుతితో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.

Dussehra sharan navaratri 202
దసరా శరన్నవరాత్రి వేడుకలు

By

Published : Oct 15, 2021, 9:13 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ ఇంద్రకీలాద్రి (VIJAYAWADA DURGA TEMPLE)పై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజైన నేడు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ రోజుతో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. పూర్ణాహుతితో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. సాయంత్రం కృష్ణానది ఒడ్డున ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నదిలో నీటి ఉద్ధృతి కారణంగా ఉత్సవమూర్తుల జలవిహారం రద్దు చేశారు.

దసరా చివరిరోజు ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుంచి క్యూలైన్లలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. క్యూలైన్లు ఆలస్యం కావడంతో పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగుతున్నారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందంటూ భక్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: Dussehra Festival: ఆయుధధారిణి.. శక్తి స్వరూపిణి.. జగన్మాత

ABOUT THE AUTHOR

...view details