ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ తేదీలను వైదిక కమిటీ ఖరారు చేసింది. అక్టోబరు ఏడో తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో డి.భ్రమరాంబ తెలిపారు. అక్టోబరు ఏడో తేదీ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజున జగజ్జననీ లోకమాత కనకదుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఎనిమిదో తేదీ బాలా త్రిపురసుందరీదేవిగా, తొమ్మిదో తేదీన గాయత్రీదేవిగా, పదో తేదీ లలితా త్రిపురసుందరీదేవిగా, 11వ తేదీ ఉదయం నాలుగు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అన్నపూర్ణదేవిగా, మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పది గంటల వరకు మహలక్ష్మిదేవిగా దర్శనమిస్తారు. అక్టోబరు 12న సరస్వతిదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.
బెజవాడ దుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాల తేదీలు ఖరారు - ఏపీ వార్తలు
ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ తేదీలను వైదిక కమిటీ ఖరారు చేసింది. అక్టోబరు ఏడో తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో డి.భ్రమరాంబ తెలిపారు.
దసరా నవరాత్రి ఉత్సవాలు
అదే రోజున ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 13వ తేదీన దుర్గాదేవిగా, 14న మహిషాశుర మర్దినిగా, రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకరిస్తారని ఈవో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'వరుడు కావలెను' టీజర్.. 'తుగ్లక్ దర్బార్' ట్రైలర్