రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులు యథాతథం - Dussehra holidays will continue from 26th
![రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులు యథాతథం పాఠశాలలకు ఈ నెల 26 నుంచి దసరా సెలవులు యథాతథం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16432217-1030-16432217-1663750447464.jpg)
13:52 September 21
Dussehra holidays దసరా సెలవులపై విద్యాశాఖ క్లారిటీ
Dussehra holidays దసరా సెలవులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. సెలవులు తగ్గించాలన్న రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రతిపాదనను తిరస్కరించింది. సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని.. ఈనెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు యథాతథంగా పాఠశాలలకు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది.. అక్టోబర్ 10న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. భారీ వర్షాల కారణంగా జులైలో పాఠశాలలకు సెలవులు ఇచ్చినందున.. నష్టపోయిన బోధన పనిదినాల భర్తీకి దసరా సెలవులు తగ్గించాలని పాఠశాల విద్యాశాఖకు ఎస్‌సీఈఆర్‌టీ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ తొలుత ప్రకటించిన విధంగానే దసరా సెలవులు కొనసాగుతాయని వెల్లడించింది.
ఇవీ చూడండి: