తెలంగాణ

telangana

ETV Bharat / state

Dussehra Festival celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. దుర్గామాత ఆలయాలకు పోటెత్తిన భక్తులు - తెలంగాణలో దసరా పండగ ఉత్సవాలు

Dussehra Festival celebrations in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని.. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా దుర్గామాత ఆలయాలకు.. ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. అమ్మలుగన్న అమ్మను దర్శించుకుని.. భక్తి పారవశ్యంలో మునిగితేలారు. ఆయుధ, వాహన పూజలతో సందడి చేశారు.

Dussehra Festival celebrations 2023
Dussehra Festival celebrations in Telangana

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 7:55 PM IST

Dussehra Festival celebrations in Telangana రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. దుర్గామాత ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Dussehra Festival celebrations in Telangana : విజయదశమి దృష్ట్యా.. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల చెంత సందడి నెలకొంది. ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు(Dussehra Festival 2023) ఘనంగా జరిగాయి. అంకురార్పణతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. తెప్పోత్సవంతో ముగియనున్నాయి. ఉదయం అమ్మవారికి విశేష పూజలతో పాటు ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు.. అనంతరం అమ్మవారిని రకరకాల పూలతో అందంగా తీర్చిదిద్దారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. ఆలయ ప్రాంగణంలో భక్తులు తమ వాహనాలకు.. వాహన పూజలు చేసుకున్నారు.

యాదాద్రి పంచనారసింహుని ఆలయ(Yadadri Lakshmi narasimha Swamy) సన్నిధిలో అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో విధులు నిర్వహించే ఆలయ భద్రతా విభాగం, పోలీస్ సిబ్బంది వద్ద ఉన్న ఆయుధాలతో ఆలయంలో ఆయుధ పూజలు నిర్వహించారు. ఆలయ భద్రతా సిబ్బంది.. పూజల అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆలయ ఉద్యోగులు అందరూ ఆనందంగా గడిపారు.

Tallest Effigy of Ravana : దేశంలోనే అత్యంత ఎత్తైన రావణుడి బొమ్మ.. 171 అడుగుల ఎత్తుతో..

Dussehra 2023 Celebrations :భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో తొమ్మిదో రోజు శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు నిజ రూపంలో.. మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని సీతారాములతో పాటు లక్ష్మణ స్వామి ఆంజనేయస్వామి శ్రీ లక్ష్మీ తాయరు అమ్మవారు ముత్యాల వస్త్రాలతో ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విజయదశమి వేడుకలు నిర్వహించారు. మంగళవారం సీతారాములను దసరా మండపం వద్దకు తీసుకెళ్లి ఆయుధపూజ, సెమీపూజ, శ్రీరామ లీల మహోత్సవం నిర్వహించనున్నారు.

Dussehra Festival celebrations in Peddamma Thalli Temple :దసరా పండుగ దృష్ట్యా భాగ్యనగరం(Dussehra Celebrations at Hyderabad)లోని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లిని.. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా దేవాలయ ఛైర్మన్ పి. విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో రాజ్యసభ సభ్యుడు కేకే తోపాటు హైదరాబాద్ మేయర్ గద్వాల్ జయలక్ష్మి పాల్గొన్నారు. పలు చోట్ల దుర్గామాత ఊరేగింపులు, నిమజ్జనాలతో.. సందడి నెలకొంది. చిన్నా, పెద్ద నృత్యాలు చేశారు. ఇక్కడ ఈనెల 15 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో దాదాపు 10 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని అధికారులు తెలిపారు.

Dussehra Festival Celebrations at Pragati Bhavan : ప్రగతి భవన్​లో ఘనంగా దసరా వేడుకలు.. కుటుంబ సమేతంగా పాల్గొన్న సీఎం కేసీఆర్​

Dussehra Special Home Foods : పండుగల వేళ.. 'హోమ్ ఫుడ్స్​'కు నగరవాసుల ఫిదా.. గారెలు, అరిసెలు, కారప్పూసలు.. పిండి వంటలేవైనా..!

ABOUT THE AUTHOR

...view details