రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి (Dussehra celebrations). పలు ప్రాంతాల్లోని మైదానాలు, ఆలయాల సమీపంలో రావణకాష్ఠం నిర్వహించారు. హైదరాబాద్ అంబర్‌పేట్‌లో రావణ ప్రతిమ దహన కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరుకాగా... కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు... రావణ విగ్రహానికి నిప్పటించారు. ముషీరాబాద్ జెమినీకాలనీలో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థానికులు... తొమ్మిదిరోజులు పాటు ప్రత్యేక పూజలు చేశారు ( Dussehra celebrations). చివరిరోజు అమ్మవారి విగ్రహం వద్ద భారీ లడ్డూను వేలంపాట నిర్వహించగా... ఓ భక్తుడు 2లక్షల 5వేలకు దక్కించుకున్నాడు. శేరిలింగంపల్లి లక్ష్మీవిహార్‌కాలనీ సాయిబాబా ఆలయంలో దసరా సందర్భంగా.... మహిళలు దాండియా ఆడి సందడి చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ప్రజలు జమ్మి పెట్టుకొని ఒకరికి ఒకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో రావణ దహనం పూర్తి చేశారు.
కన్నుల పండువగా భద్రకాళీ తెప్పోత్సవం
దసరా పర్వదిన వేళ వరంగల్ భద్రకాళీ అమ్మవారి తెప్పోత్సవం.... ఆద్యంతం కన్నులపండువగా జరిగింది ( Dussehra celebrations). అమ్మవారికి పూజలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్... తెప్పోత్సవంలో పాల్గొన్నారు. నర్సంపేటలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శమీపూజ చేసిన ప్రజలు... జమ్మి పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం రావణాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జమ్మిచెట్టుకు పూజ చేశారు. అనంతరం రావణ దహనం కార్యక్రమాన్ని పూర్తిచేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో దసరా వేడుకలు సందడిగా సాగాయి. సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన డ్యాన్స్ పోటీల్లో... యువతీయువకులు తమ నృత్యాలతో హోరెత్తించారు.
వైభవంగా శమీపూజ, రావణ దహనం