రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ, రేపు చాలాచోట్ల, ఎల్లుండి అనేక చోట్ల వానజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు
ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వెల్లడించింది.
రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు
ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో 3.1 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వివరించింది. దీని ప్రభావంతో రేపు.. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇవీచూడండి:కరోనా బాధితులను వెలివేసినట్లు చూడడం సరికాదు: కేటీఆర్