ECET Postponed: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎల్లుండి జరగాల్సిన ఈసెట్ వాయిదా వేశారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈనెల 14 నుంచి ఎంసెట్ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.
ECET Postponed: ఎల్లుండి జరగాల్సిన ఈసెట్ వాయిదా.. ఎంసెట్ యథాతథం - ts eamcet
18:03 July 11
ECET Postponed: వర్షాల కారణంగా ఎల్లుండి జరగాల్సిన ఈసెట్ వాయిదా
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై కన్వీనర్లు, ఇతర సంబంధిత అధికారులతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ సమీక్ష జరిపారు. ఈనెల 13 వరకు ప్రభుత్వం విద్యా సంస్థలు ప్రకటించడం... పలు ప్రాంతాల్లో వరద ఉద్ధృతి ఉన్నందున ఈసెట్ వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈసెట్ మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని తర్వాత ఖరారు చేస్తామని లింబాద్రి పేర్కొన్నారు. ఈనెల 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, 18 నుంచి 20 వరకు జరిగే ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా ఉంటుందని... షెడ్యూలులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. వాయిదా వేస్తే ఆన్లైన్ పరీక్షలకు షెడ్యూలు ఖరారు చేయడం కష్టమన్న ఉద్దేశంలో యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.
ఇవీ చదవండి:భద్రాచలం వద్ద గోదారమ్మ ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
లీవ్ ఇవ్వలేదని జవాన్ సూసైడ్.. 18 గంటలు కుటుంబాన్ని బందీగా చేసుకొని!