పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది - lockdown news in guntur
ఆటోలో కొత్తిమీర అమ్ముకుందామని తెచ్చుకున్నాడు. లాక్డౌన్ టైమింగ్‌ని మరిచాడో ఏమో పాపం ఆ రైతన్న.. పోలీసులను చూసి భయపడ్డాడు. మొత్తం సరుకుని రోడ్డు పాలు చేశాడు.
పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది
ఓ రైతు తన ఆటోలో కొత్తిమీర కట్టలను అమ్ముదామని తీసుకొని వెళ్తుండగా రోడ్డుపై పోలీసులను చూసి భయపడ్డాడు. 9 గంటల సమయంలో ఆటోని వెనక్కి తీసుకొని వెళ్లిపోయాడు. ఇంక ఈ కొత్తిమీరను ఎవ్వరూ కొనరని అనుకున్నాడు. ఏం చేయాలో తోచక ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఏటుకూరు జాతీయ రహదారికి పక్కన సరుకును పడేశాడు. అటువైపుగా రాకపోకలు చేసిన చాలా మంది ఆ కట్టలను తీసుకుపోయారు.