రాష్ట్ర బడ్జెట్లో దివ్యాంగులకు 2వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని రాష్ట్ర డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ కమిటీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ బాగ్లింగంపల్లి టీపీఎస్కే హాలులో డీఎస్డీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు చర్చించారు.
'మా సమస్యలను పరిష్కరించండి' - DSD State Working Committee meeting was held at TPSK Hall, bhaghLingampally,
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. డెవలప్మెంట్ సొసైటీ ఫర్ డెఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో వారి డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి వినతి చేశారు.
'మా సమస్యలను పరిష్కరించండి'
ఈ భేటీలో రాష్ట్రంలో 25 లక్షల జనాభా కలిగిన దివ్యాంగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నట్లు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వల్లభనేని ప్రసాద్ తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దివ్యాంగుల పెన్షన్లను రూ. 3016 నుండి 6 వేలకు పెంచాలన్నారు. వారి స్వావలంబనకు తోడ్పాటు అందించాలని కోరుతూ.. ప్రభుత్వానికి విన్నవించారు.
ఇదీ చదవండి:పాతబస్తీలో ఆకతాయిల బీభత్సం.. కత్తులు, తల్వార్లతో వీరంగం