తెలంగాణలోకి వాయువ్య, పశ్చిమ దిశ గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.
weather: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పొడి వాతావరణం
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోకి వాయువ్య, పశ్చిమ దిశ గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతోనే పొడి వాతావరణం ఏర్పడుతుందని పేర్కొంది.
weather
ఎల్లుండి రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. సైక్లోన్ ప్రభావం వల్ల రాగల రెండు, మూడు రోజులు తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
Last Updated : May 26, 2021, 5:34 PM IST