దోమల నుంచి వచ్చే డెంగీ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రపరచుకోవాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పేరిట మంత్రి కేటీఆర్ ప్రారంభించిన డ్రైడే కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా బేగంపేటలోని పర్యాటక భవన్ ప్లాజా హోటల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టారు.
ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి: శ్రీనివాస్ గౌడ్ - Dry Day programme attended by Minister Srinivas Goud
సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా బేగంపేటలోని పర్యాటక భవన్ ప్లాజా హోటల్లో దోమల నివారణకు మంత్రి చర్యలు చేపట్టారు. సమాజహితం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

'డెంగ్యూని తరిమికొడదాం'
పూలతొట్టి, నిల్వ ఉండే ప్రాంతాల్లోని నీటిని తొలగించారు. దోమల ద్వారా సంక్రమించే అన్ని రకాల సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. సమాజహితం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి :జనావాసాల్లోకి చిరుతలు రాకుండా ఇలా చేస్తాం.!