ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రామారావుపేటలో ఓ వైన్ షాపు వద్ద క్యూలైన్లలో నిల్చున్న మందుబాబుల్ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రేమే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులు తెల్లవారుజాము నుంచే దుకాణాల వద్ద బారులు తీరారు. కొవిడ్ నిబంధనల్ని ఏమాత్రం పట్టించుకోకుండా లైన్లలో నిల్చున్నారు.
నిషా కోసం నిరీక్షణ... కరోనా ఉన్నా డోంట్ కేర్..!
తెల్లవారకముందే మందుబాబులు మద్యం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. కరోనా కేసులు వందల సంఖ్యలో వస్తున్నా.. తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సీసా దక్కితే చాలని గంటలకొద్దీ పడిగాపులు పడుతున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ మద్యం దుకాణం వద్ద మందుబాబులు ఇలా క్యూకట్టారు.
నిషా కోసం నిరీక్షణ... కరోనా ఉన్నా డోంట్ కేర్..!
ఓవైపు రోజూ వందల సంఖ్యలో కేసులు పెరిగిపోతుంటే.. మందుబాబులు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి:కరోనా సోకిందని తీసుకెళ్లారు... ఓ టాబ్లెట్ ఇచ్చి ఇంటికి పంపేశారు..!