తెలంగాణ

telangana

ETV Bharat / state

సదర్ ఉత్సవాల్లో మందుబాబుల వీరంగం - సదర్​లో పాల్గొన్న యువకులపై దాడి

పూటుగా తాగారు. రోడ్డుపై నానా హంగామా చేశారు. అనంతరం సదర్​లో పాల్గొన్న కొందరు యువకులను చితకబాది దర్జాగా వెళ్లిపోయారు.

సదర్ ఉత్సవాల్లో మందుబాబుల వీరంగం

By

Published : Oct 29, 2019, 9:21 AM IST

Updated : Oct 29, 2019, 11:31 AM IST

హైదరాబాద్ ఎస్‌.ఆర్‌.నగర్ పోలీస్ స్టేషన్ పరిధి మోతీ నగర్​లో ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళనం లో అపశ్రుతి చోటుచేసుకుంది. కొందరు యువకులు పీకల దాకా మద్యం సేవించి రోడ్డుపై హల్​చల్‌ చేశారు. అనంతరం సదర్​లో పాల్గొన్న కొందరు యువకులను చితకబాదారు. ఈ విషయంపై బాధితులు ఘటన స్థలంలోని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా... ఈ ఘటన తమ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి రాదంటు సనత్‌ నగర్‌, ఎస్‌.ఆర్‌.నగర్‌ పోలీసులు తప్పించుకున్నారు. ఏం చేయాలో పాలుపోని బాధితులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఘటన జరిగినప్పటికీ... పోలీసులు రాకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదర్ ఉత్సవాల్లో మందుబాబుల వీరంగం
Last Updated : Oct 29, 2019, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details