తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్తెక్కిస్తున్న మందుబాబులు

రాష్ట్రంలో మందుబాబుల జోరు రోజురోజుకి పెరిగిపోతోంది. మత్తులో జోగుతూ పోలీసులకే మతి పోయేలా చేస్తున్నారు. డ్రంక్ అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో కల్లుతిరిగే జరిమానాలు కడుతూ సర్కార్​ ఖజానా నింపుతున్నారు.

పేట్రేగుతున్న తాగుబోతులు..!

By

Published : Feb 16, 2019, 10:27 PM IST

Updated : Feb 16, 2019, 11:37 PM IST

పేట్రేగుతున్న తాగుబోతులు..!
పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా.. మరెన్నో కఠిన శిక్షలు వేసినా... హైదరాబాద్​లో మందుబాబులు మాత్రం మత్తులో ఊగుతూ రోడ్డెక్కెస్తున్నారు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు 1788 కేసులు నమోదయ్యాయంటే పోలీసుల హెచ్చరికలు ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమవుతోంది. ఇందులో 468 మందికి కోర్టు శిక్షలు విధించగా... 108 మంది డ్రైవింగ్​ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేసింది. ఇక జరిమానాల మొత్తం చూసి పోలీసులే అవాక్కయ్యారు. పదిహేను రోజుల్లో అక్షరాల 38,48,700 రూపాయలు జరిమానాలు వసూలయ్యాయంటే ట్రాఫిక్​ నిబంధనలు ఎంతగా పాటిస్తున్నారో తెలుస్తోంది.

పలుసార్లు నిబంధనలు అతిక్రమించి, మత్తులో రోడ్డెక్కిన ప్రబుద్ధులకు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. నలుగురికి 30రోజులు, ముగ్గురికి 20, ఇద్దరికి 15, పది మందికి 10 రోజులు చంచల్​ గూడా జైలుకి పంపించింది.
నగరవాసుల భద్రత కోసమే పోలీసులు నిబంధనలు, హెచ్చరికలు చేసినా... కఠిన చర్యలు తీసుకున్నా... మందు బాబులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
Last Updated : Feb 16, 2019, 11:37 PM IST

ABOUT THE AUTHOR

...view details