హైదరాబాద్ శివార్లలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మేడిపల్లి పీఎస్ పరిధి చెంగిచెర్ల వద్ద అదే గ్రామానికి చెందిన దోడెల పరమేశ్ అనే పాల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి హతమార్చారు. పరమేశ్ తలపై బలమైన గాయలు ఉండడం, దగ్గరలో కత్తి దొరకడంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు. హత్య జరిగిన దగ్గరలోనే బార్ ఉండడంతో మద్యం సేవించి వారితో గోడవపడటం వల్ల హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. వేలిముద్రల నిపుణులతో ఆధారాలు సేకరించారు.
మద్యం మత్తులో గొడవ.. వ్యక్తి దారుణ హత్య - drunkenness one man killed latest news
తాగిన మైకంలో గుర్తు తెలియని వ్యక్తులతో గొడవ పడడం హత్యకు దారితీసింది. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలోని ఓ వ్యక్తిని అమానుషంగా కొట్టి చంపారు.
తాగిన మైకంలో రచ్చ.. వ్యక్తి హత్య