తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం తాగి రోడ్డుపై కానిస్టేబుల్​ వీరంగం.. సస్పెండ్ చేసిన సీపీ.. - మద్యం తాగిన పోలీస్​ కానిస్టేబుల్​ సస్పెండ్​ తాజా వార్త

పోలీస్ యూనిఫార్మ్​లో ఉండి మద్యం సేవించి నడిరోడ్డుపై చిందులేసిన కానిస్టేబుల్ ఈశ్వరయ్యను హైదరాబాద్ పోలీస్  కమిషనర్ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు.

drunken constable suspend in Hyderabad
మద్యం తాగి రోడ్డుపై వీరంగం సృష్టించిన కానిస్టేబుల్​ సస్పెండ్​

By

Published : Dec 3, 2019, 2:45 PM IST

ఫలక్​నుమ పోలీస్ స్టేషన్​కు చెందిన కానిస్టేబుల్ ఈశ్వరయ్యను సీపీ అంజనీ కుమార్​ సస్పెండ్​ చేశారు. సోమవారం రాత్రి ఫలక్​నుమ పోలీస్​స్టేషన్​ పరిధిలోని గోశాల వద్ద పికెట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్​ మద్యం సేవించి ఖాకీ దుస్తులపైనే రోడ్​పై వీరంగం సృష్టించాడు. వాహనాల ఎదుట కూర్చొని వాహనదారులకు ఇబ్బంది కలిగించాడు.

ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఈశ్వరయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ మద్యం సేవించినా గుర్తించని స్టేషన్ సీఐ శ్రీనివాస్​కి తాఖీదులు జారీచేశారు.

మద్యం తాగి రోడ్డుపై వీరంగం సృష్టించిన కానిస్టేబుల్​ సస్పెండ్​

ఇదీ చూడండి: శివానగర్​ హత్యకేసును ఛేదించిన పోలీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details