హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ప్రధాన రహదారిపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మత్తులో ఉన్న వ్యక్తి రహదారిపై అడ్డంగా పడుకోవడం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
రోడ్డుపై పడుకున్న మందుబాబు... ట్రాఫిక్‌కు అంతరాయం - traffic jam in srnagar due to drunk man
పూటుగా మద్యం సేవించాడు. పడుకోవడానికి స్థలం దొరకలేదు కాబోలు.. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఎస్ఆర్ నగర్ ప్రధాన రహదారిపై పడుకున్నాడు. అంతే మందుబాబు కారణంగా ఎస్ఆర్ నగర్ నుంచి అమీర్‌పేట వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
రోడ్డుపై పడుకున్న మందుబాబు... ట్రాఫిక్‌కు అంతరాయం
ఎస్ఆర్ నగర్ ప్రధాన రహదారి నుంచి అమీర్‌పేట షాపింగ్ మాల్ వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి కదలలేని పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తాగుబోతు వ్యక్తిని అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నో పార్కింగ్ బోర్డును తన బ్యాగులో పెట్టుకోవడం విశేషం.
ఇదీ చూడండి:సాగు చట్టాల విషయంలో సీఎం యూటర్న్: బండి సంజయ్