హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పోలీసులు ప్రారంభించారు. కొవిడ్ కారణంగా గత కొన్ని నెలలుగా నిలిపివేసిన తనిఖీలను శుక్రవారం నుంచి ఉన్నతాధికారుల ఆదేశాలపై ప్రారంభించారు.
మొదలైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు - జూబ్లిహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభించారు. కొవిడ్ దృష్ట్యా గత కొన్ని నెలలుగా నిలిపివేసిన తనిఖీలు... పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభించారు.
మందుబాబుల ఆటకట్టు... మొదలైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 18 మందిపై కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేశారు. వాటిలో 11 ద్విచక్ర వాహనాలు, 7 కార్లు ఉన్నాయి, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తనిఖీలు చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:నకిలీ ఎస్వోటీ పోలీస్ ముఠా అరెస్ట్