తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో 62మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

భాగ్యనగరంలో మందుబాబులు మళ్లీ పట్టుబడ్డారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మేమింతే అంటూ ఫుల్లుగా తాగి దొరికిపోయారు. కొందరు శ్వాసపరీక్షలకు నిరాకరిస్తే.. మరికొందరు తప్పించుకునేందుకు ప్రయత్నించారు.

By

Published : Oct 27, 2019, 9:57 AM IST

హైదరాబాద్​లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్​లోని నాలుగు ప్రాంతాలలో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో 62 మంది మందుబాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 42 కార్లు, 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది మందు బాబులు శ్వాస పరీక్షలకు నిరాకరిస్తూ... పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరు తప్పించుకునేందుకు యత్నించగా.. వెంబడించి పట్టుకున్నారు. పలువురు మహిళలు మద్యం సేవించి దొరికారు. వీరందరికి సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించి మంగళవారం కోర్టులో హజరుపర్చనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

హైదరాబాద్​లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details