గత ఫిబ్రవరిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 3,261 మంది వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం సేవించినట్లు తనిఖీల్లో తేలడంతో వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వారిలో 768 మందికి బేగంపేట, గోషామహల్‌లోని ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. వాళ్లందరిపై నేరాభియోగ పత్రం దాఖలు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు.
3,261 మంది వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు - హైదరాబాద్ తాజా వార్తలు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత ఫిబ్రవరిలో 3,261 మంది వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు... ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, వీసా వంటివి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
15 మందికి 5 నుంచి 15 రోజుల వరకు న్యాయస్థానం... సాధారణ జైలు శిక్ష విధించిందని అన్నారు. మిగిలిన 753 మంది వాహనదారులకు మొత్తం రూ.78 లక్షల 94వేల జరిమానా చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపారు. 2,493 మంది వాహనదారులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, పాస్ పోర్టు వంటివి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
ఇదీ చదవండి: ఇతర రాష్ట్రాలకు 'వీ హబ్' ఆదర్శంగా నిలుస్తోంది: మంత్రి కేటీఆర్