హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు - search
హైదరాబాద్‌లో మందుబాబులు పోలీసులను ఇబ్బందులు పెడుతున్నారు. తాగి వాహనం నడపడమే కాకుండా.. ట్రాఫిక్ పోలీసులకు సహకరించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి 86 వాహనాలను సీజ్ చేశారు.
హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
హైదరాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. తాగి వాహనాలు నడిపిన వారు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. బ్రీత్ ఎనలైజర్‌కు సహకరించకుండా, వాహనం తాళాలు ఇవ్వకుండా ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారారు. ఈ తనిఖీల్లో మొత్తం 86 వాహనాలను సీజ్ చేయగా... అందులో 39 ద్విచక్ర వాహనాలు, 47 కార్లు ఉన్నాయి.
Last Updated : Apr 27, 2019, 7:16 AM IST