Drugs Worth Rs 50 Lakh Seized in Hyderabad : హైదరాబాద్ నగరం డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోంది. ఉల్లాసంగా ఉండడానికి, యంగ్‌గా కనిపించడానికి, ప్రిస్టేజ్ కోసం చాలా మంది యువతీ యువకులు ఈ మాదక ద్రవ్యాలకు(Drugs) అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా సమాజంపై తమ ప్రభావాన్ని చూపించే టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లోని సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(Narcotics Bureau)పోలీసులు అరెస్టు చేశారు.
సూరారం పోలీసులతో పాటు టీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. డ్రగ్స్ తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు, వారి వద్ద నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Narcotics Seized in Hyderabad : ఇప్పుడు పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.50 లక్షలుగా ఉంటుందని నార్కోటిక్స్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి పేర్కొన్నారు. డ్రగ్స్ తయారీలో ప్రధాన నిందితుడు కమ్మ శ్రీనివాస్‌గా గుర్తించామని, శ్రీనివాస్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గాజుల రామారంలో ఉంటాడని అన్నారు. మణికంఠ కాకినాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతనికి చేపల చెరువులు ఉన్నాయని తెలిపారు.
తెలిసో తెలియకో మత్తుపదార్థాలు వినియోగిస్తున్నారా, ఐతే పోలీసులకు దొరికినట్టే