Drugs Supply At Hyderabad Hotels :సండే కదా ఈరోజు కూడా వంట ఏం చేస్తాంలే అని ఫ్రెండ్స్‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్దాం అనుకున్నాను. ఏ రెస్టారెంట్(Restaurant) బెటరో అని రేటింగ్ చూద్దామని మొబైల్ తీసుకున్నాను. అలా మొబైల్ ఆన్ చేశానో లేదో.. 'బిర్యానీలో ఎక్స్ట్రా రైతా అడిగాడని కస్టమర్‌ను కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది.. యువకుడి మృతి' అంటూ ఓ నోటిఫికేషన్ వచ్చింది. అది చూడగానే గుండె దఢేల్మనిపించింది. సర్లే అన్ని రెస్టారెంట్లు అలా ఎందుకుంటాయని నాకు నేనే ధైర్యం చెప్పుకుని దగ్గరలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్ ఏంటని చూద్దామనుకునేలోగా.. 'డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని' అంటూ మరో నోటిఫికేషన్. రెండోది చూడగానే గుండె జారి కిందపడ్డంత పనైంది.
Hyderabad Restaurant Staff Beating Customers : ఎందుకంటే.. రోజు నేనూ, నా ఫ్రెండ్స్ కలిసి ఉదయాన్నే టిఫిన్ చేసే హోటల్ అదే. ఇదే విషయం నా ఫ్రెండ్స్‌కు కాల్ చేసి చెప్పాను. అప్పుడు వాళ్లు చెప్పిన మాటలు విన్న నాకు.. ఈ చదువులు, ఉద్యోగాలు మనకెందుకు .. బతికుంటే బచ్చలాకైనా తినొచ్చు అనిపించి పెట్టెబేడా సర్దుకొని ఊరెళ్లాలనిపించింది. అలాగని తిండి కోసం ఊరొచ్చేస్తానంటే మా నాన్న బెల్టు తీసి మరీ కొడతాడు. హైదరాబాద్ ఫుడ్ బిజినెస్(Hyderabad Food Business)లో జరుగుతున్న అక్రమాల గురించి తెలిసి.. ఇక ఇంట్లోనే వండుకోవడం బెటర్ అనిపించింది. వంట రాకపోయినా.. చేయాలనిపించకపోయినా ఆ పూటకు పస్తులుండటమే మేలని అనిపించింది. ఇంతకీ హైదరాబాద్ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఇటీవలే ఓ హోటల్లో బిర్యానీ తిందామని వెళ్లిన వ్యక్తి.. హాయిగా బిర్యానీ లాగించిన తర్వాత చివరలో రైతా కోసం చూశాడు. హోటల్ వాళ్లు ఇచ్చిన రైతా సరిపోక.. ఎక్స్ట్రా రైతా కావాలని అడిగాడు. దానికి ఆ హోటల్ సిబ్బంది ఎక్స్ట్రా రైతా (Restaurant Staff Beating Customers)ఇవ్వడం కుదరదంటూ కస్టమర్‌పై విరుచుకుపడ్డాడు. ఇలా మాటలతో మొదలైన గొడవ కొట్టుకునే దాకా వచ్చింది. ఇద్దరూ పడిన ఘర్షణలో కస్టమర్ మరణించాడట. బిర్యానీ తిందామని వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయి పాపం.