తెలంగాణ

telangana

ETV Bharat / state

మెడికల్​షాపుల్లో డ్రగ్స్..​ 2 ముఠాలను పట్టుకున్న యాంటీనార్కోటిక్స్ వింగ్ - today drugs gang arrest in telangana

Drugs supplier gang arrest in hyderabad: హైదరాబాద్​లో మత్తుపదార్థాల నివారణకు పోలీసులు ఎంత కట్టడి చేసిన డ్రగ్​డీలర్లు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. తాజాగా సిటీలో మెడికల్​ షాప్​లకు ప్రమాదకరమైన మత్తుపదార్థాలను సరఫరా చేస్తూ డ్రగ్స్​ విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్​ పోలీసులు పట్టుకున్నారు.

డ్రగ్స్​ సప్లయి చేస్తున్న గ్యాంగ్​ పట్టివేత
డ్రగ్స్​ సప్లయి చేస్తున్న గ్యాంగ్​ పట్టివేత

By

Published : Feb 23, 2023, 8:46 PM IST

Drugs supplier gang arrest in hyderabad: ప్రమాదకర దగ్గు మందు, మత్తు పదార్ధాలను మెడికల్ షాపులకు సరఫరా చేస్తూ వీటిని అమ్ముతున్న రెండు ముఠాలను యాంటీ నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 40 లక్షల రూపాయల విలువ చేసే ఆల్ఫోజోలం 15.2 కిలోలు, 1160 సీసాల కోడైన్‌ ఫాస్పేట్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

హర్యానాకు చెందిన పవన్‌ అగర్వాల్‌, హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ నివాసి మహ్మద్‌ బషీర్‌ అహ్మద్ మరో ఇద్దరు కలిసి కోడైన్‌ ఫాస్పేట్‌ దగ్గు మందును ఔషధ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మరో కేసులో కాచిగూడకు చెందిన వెంకట సురేష్‌ బాబు మరో పదకొండు మందితో కలిసి ముఠాగా ఏర్పడి ఆల్ఫోజోలం ఔషధాలను కార్వాన్‌, కుల్సుంపుర, నాంపల్లి, మెహదీపట్నం ప్రాంతాల్లోని ఔషధ దుకాణాలకు సరఫరా చేస్తున్న వారిని పట్టుకున్నారు

ఆయా దుకాణాల ద్వారా వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఎక్కువ మోతాదులో ఆయా ఔషధాలను సేవిస్తే మత్తు కలిగి దుష్పరిణామాలు ఏర్పడతాయని పోలీసులు వివరించారు. ఈ క్రమంలో ఔషధ దుకాణాల నిర్వాహకులు వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ తరహా ఔషధాలను విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేసి చర్యలు తీసుకుంటామని నార్కోటిక్‌ విభాగం డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు.

నార్కోటిక్​ ఎన్​ఫోర్స్​మెంట్​ వింగ్​, మలక్​పేట్​, కుల్సుంపుర పోలీసులు ద్వారా రెండు డ్రగ్​ ముఠాలను అరెస్ట్​ చేశాము. ఈ ముఠాలోని 15మందిలో డ్రగ్​ డీలర్లు, సప్లయర్లు, సెల్లర్స్​ ఉన్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 40 లక్షల రూపాయల విలువ చేసే ఆల్ఫోజోలం 15.2 కిలోలు, 1160 సీసాల కోడైన్‌ ఫాస్పేట్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాము. హర్యానాకు చెందిన పవన్‌ అగర్వాల్‌, హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ నివాసి మహ్మద్‌ బషీర్‌ అహ్మద్ మరో ఇద్దరు కలిసి కోడైన్‌ ఫాస్పేట్‌ దగ్గు మందును ఔషధ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఆయా దుకాణాల ద్వారా వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని విక్రయిస్తున్నారు. వీటిని విక్రయించే దుకాణాల లైసెన్స్​ రద్దు చేస్తాం. -గుమ్మి చక్రవర్తి, నార్కోటిక్‌ విభాగం డీసీపీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details