MDMA Drugs Seized by Secretariat Police : హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. మహారాష్ట్ర నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠాను సచివాలయం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ పవార్(Central Zone DCP Sharat Pawar) తెలిపారు. వారి నుంచి రూ.7లక్షల విలువైన 100 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను(MDMA Drugs) స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అల్ఫాజోలం కొకైన్ కంటే ప్రమాదకరం - అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు : సందీప్ శాండిల్య
Rs.7 Lakhs Worth Drug Sized in Hyderabad : న్యూ ఇయర్ వేడుకల్లో(New Year Events) విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చారని తెలిపారు. అక్కడ ఒక్క గ్రాము డ్రగ్‌ని రూ.2వేలకు కొని హైదరాబాద్‌లో రూ.7వేలకు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిందితులు మహారాష్ట్రలో ఒక నైజీరియన్ జ్యో నుంచి కొన్నట్టు ఒప్పుకున్నారని చెప్పారు. ప్రస్తుతం పరారీలో వున్న జ్యో కోసం గాలిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ అమ్మేవారిపై, కొనేవారిపై పోలీసులు నిఘా ఎప్పుడూ ఉంటుందని డీసీపీ హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయించేవారే కాకుండా వినియోగించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.