తెలంగాణ

telangana

ETV Bharat / state

Drugs Seize in Hyderabad : రాయదుర్గంలో డ్రగ్స్ స్వాధీనం.. రాజమండ్రికి చెందిన ముఠా అరెస్ట్​

Drugs Seize in Rayadurgam : రాయదుర్గంలో మాదక ద్రవ్యాలను​ విక్రయిస్తున్న.. రాజమండ్రికి చెందిన నలుగురు ముఠా సభ్యులను సైబరాబాద్​ ఎస్​ఓటీ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో నగరంలో డ్రగ్స్​ అమ్మకాలు జరుపుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.

Drugs Seize in Hyderabad
Drugs Seize in Rayadurgam

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 4:00 PM IST

Drugs Seize in Rayadurgam :గోవా నుంచి హైదరాబాద్​కు మాదక ద్రవ్యాలను తరలించి విక్రయాలు జరుపుతున్న నలుగురు ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32 గ్రాముల కొకైన్​తో పాటు మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోన్నారు. రాజమండ్రికి చెందిన విక్కీ, రాజేష్ గోపిశెట్టి, నరేష్, తోట క్రాంతి కుమార్​లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Drugs Seize in Rayadurgam

Madhapur Drugs Case Updates : నిత్యం వివాదాలకు కేరాఫ్​ అడ్రస్​ @ యాక్టర్ నవదీప్

Drug Selling Gang Arrested in Rayadurgam : ప్రధాన నిందితుడు విక్కీ సులభంగా డబ్బులను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకొని నగరంలో డ్రగ్స్ అమ్మకాలను జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. విక్కీ, రాజేశ్​లు చిరు వ్యాపారులకు కొకైన్​ను డెలివరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపైనా ఎన్డీపీఎస్​ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. గతంలో కూడా విక్కీ డ్రగ్స్ విక్రయాలను జరిపిన్నట్లు పోలీసులు గుర్తించామన్నారు.

ED Calls navdeep : మరోవైపు మదాపూర్​ డ్రగ్స్​ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీనటుడు నవదీప్​కు(Cine Actor Navdeep) ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 10న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. డ్రగ్స్​తో పాటు మనీలాండరింగ్​ కోణంలోనూ ఈడీ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఈ కేసులో నార్కోటిక్​ పోలీసులు నవదీప్​ను విచారించారు. తన మొబైల్​లో ఉన్న డేటాని డిలీట్​ చేసినట్లు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు.

Madhapur Drugs Case :ఈ కేసులో 81 లింక్​లు గుర్తించారని అన్నారు. అందులో 41 లింకులపై ఉన్న వివరాలను తెలిపాడని వివరించారు. అతను డ్రగ్స్​ వాడకం గురించి అడిగితే.. గతంలో వినియోగించారని.. సిట్​, ఈడీ విచారణలో చెప్పిన విషయాన్ని చెప్పారన్నారు. ప్రస్తుతం మాత్రం డ్రగ్స్​ వాడలేదని సమాధానమిచ్చాడని అన్నారు. నవదీప్​కి, రామ్​చంద్​కి సంబంధం ఏమిటని ఆరా తీశామని వెల్లడించారు. దానికి సమాధానంగా నవదీప్(Navdeep)​ గతంలో వారు కలిసి బీపీఎం పబ్‌ నిర్వహించారన్నారు. తన ఫోన్​ తీసుకుని పరిశీలించారని తెలిపారు. తన మొబైల్​లో ఉన్న డేటాని డిలీట్​ చేశారని.. అతని ఫోన్ రీట్రైవ్ చేసి మళ్లీ విచారిస్తామని స్పష్టం చేశారు.

మాదాపూర్ రేవు పార్టీ డ్రగ్స్​ కేసులో.. మొదటగా పట్టుబడిన సినీ ఫైనాన్షియర్‌ కె.వెంకటరత్నారెడ్డి, బాలాజీని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించగా.. సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది పేర్లు, నైజీరియన్లతో డ్రగ్స్‌ లింకులు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నుంచి 2.8 గ్రాముల కొకైన్, 6 ఎల్‌ఎస్డీ బోల్ట్స్‌, 25 ఎక్స్‌ట్రాపిల్స్, 40 గ్రాముల గంజాయి, రూ.72,500 నగదు, 2 కార్లు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

50 Crore Worth Drugs seized at Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో.. రూ.50 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత

డ్రగ్స్​ స్మగ్లింగ్​పై కేంద్రం ఉక్కుపాదం.. 1.44 లక్షల కిలోల మాదకద్రవ్యాలు ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details