Drugs Seize in Hyderabad : రాష్ట్రంలో డ్రగ్స్ పదం వినబడకూడదన్న సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) ఆదేశాలతో పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు ప్రారంభించారు. తాజాగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న శివరాంపూర్ బాబు కిరణ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో పెరిగిన నేరాలు - డ్రగ్స్, భూదందాలపై ఉక్కుపాదం మోపుతాం : సీపీ శ్రీనివాస్ రెడ్డి
సదరు నిందితుడు బెంగుళూరు నుంచిహైదరాబాద్‌కు(Hyderabad) మాద్యకద్రవ్యాలను తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇతడిని బెంగళూరుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు వివరించారు. ఒక్కో ట్యాబ్లెట్‌ను 6 వేలకు కొనుగోలు చేసి నగరంలో 10-12 వేలకు విక్రయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తెలిందని తెలిపారు.
Fake Medicines Seized in Hyderabad :మరోవైపునగరంలో నకిలీ ఔషధాలు విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు గుర్తించారు. దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో సోదాలు చేసి రూ. 26లక్షల విలువైన నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. ఒత్తిడి, యాంటీబయోటిక్స్‌కు వినియోగించే నకిలీ ఔషధాలను ఉత్తరాఖండ్, కాశీపూర్ నుంచి కొరియర్ సంస్థల ద్వారా రవాణా చేస్తున్నారని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు గుర్తించారు. నకిలీ ఔషధాలను విక్రయించేందుకు అక్రమమార్గంలో హైదరాబాద్‌కు తరిలిస్తున్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే నకిలీ ఔషధాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ శాఖ డీజీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.
వైఎస్సార్సీపీ నేత కుమారుడి రేవ్ పార్టీలో డ్రగ్స్ - ఎస్ఆర్ నగర్ మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తులో గుర్తించిన పోలీసులు
Drugs Seize in Shadhnagar :మరో కేసులోగోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు మహిళలను రాయికల్ టోల్‌ప్లాజా వద్ద షాద్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. వీరిని ప్రియా (29), ఎం.శ్రీతేజ (29)గా గుర్తించారు. వీరిరువురి నుంచి లక్ష రూపాయల విలువైన ఎండిఎంఎ డ్రగ్స్ పట్టుకున్నట్లు ఏసీపీ రంగస్వామి వెల్లడించారు. ఈ సరఫరాలో రష్యా దేశస్థురాలు కీలక సూత్రధారిగా గుర్తించినట్లు తెలిపారు. సదరు రష్యన్ మహిళపై కేసు నమోదు చేశామన్నారు. వీటిని కొనుగోలు చేస్తున్న వారిలో హైదరాబాద్‌కు చెందిన దినేష్ అలియాస్ దినో, గిరీష్, మాదాపూర్‌కు చెందిన అఖిల్ ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిని త్వరలో పట్టుకుని దర్యాప్తు చేస్తామని వివరించారు
భాగ్యనగరంలోకి న్యూ ఇయర్ డ్రగ్స్ - అడుగడుగునా నిఘాతో పోలీసుల స్పెషల్ డ్రైవ్